దర్శకుడు హరీష్ శంకర్ సంచలన ట్వీట్

దర్శకుడు హరీష్ శంకర్ సంచలన ట్వీట్

0
84

టాలీవుడ్ లో హరీష్ శంకర్ విభిన్న కథలను ఎంచుకుని సినిమాలు చేస్తారు ఆయన, టాలీవుడ్ లో ఆయనకంటూ ప్రత్యేకంగా దర్శకుడిగా గుర్తింపు ఉంది. ఇటీవల గద్దలకొండ గణేష్ తో విజయం అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

అయితే ఏదైనా సినిమా వచ్చినా ఫంక్షన్ జరిగినా వారికి ఆనందం కలిగేలా ట్వీట్ పెట్టడం విష్ చేయడం చేస్తూ ఉంటారు హరీష్… కాని తాజాగా ఆయన వదిలిన ట్వీట్ మాత్రం కొందరికి తగిలింది …అసలు అది ఎవరికి తగిలింది అనేది చూస్తే, ఆయన ట్వీట్ చూడాలి.

నేనూ గెలవాలి.. అల్ ది బెస్ట్. నేను గెలవాలి.. ఓకే. నేనే గెలవాలి.. సారీ బాస్` అంటూ హరీష్ ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్ ఆయన సంక్రాంతికి విడుదల అయిన సినిమాలు వసూళ్ల విషయంలో చేసుకుంటున్న ప్రచారాల వల్ల చేశారా లేదా రాజకీయంగా ఏపీలో జరుగుతున్న విషయం వల్ల ఆయన ఇలా ట్వీట్ చేశారా అనేది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు, మొత్తానికి ఎవరికి అర్ధం కాకుండా తికమక పెట్టారు ఆయన ట్వీట్ తో.