జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి అమరావతిలో భూములు ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రవి చంద్రారెడ్డి తాజాగా ఆయన ఓ ప్రముఖ ఛానల్ ఏర్పాటు చైసిన చర్చా వేధికలో మాట్లాడారు…
పవన్ వేర్వేరు సర్వే నంబర్లతో భూమి కొన్నారని అందుకు సంబంధించిన ఫోటోలను కూడా మీడియా సాక్షిగా ప్రజలకు చూపించారు…. పవన్ 2018 ఏప్రిల్ 13న కొదెల పవన్ కళ్యాణ్ పేరు పై రాజులపాలెం లింగాయపాలెలంలో సర్వే నంబర్ 64బీ 67బీ 83బీ మందడం దగ్గర 131 ఏ 139 ఏలో 62 ఎకరాలు కొన్నట్లు తెలిపారు…
ఈ భూమి విలువ 2 కోట్ల 40 లక్షల 46 వేలు అని పేర్కొన్నారు… అలాగే పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి పేరుమీద 2018లో ఆగస్టు 28న 20 ఎకరాలు కొన్నట్లు తెలిపారు ఈ భూమి విలువ కోటీ 80 లక్షల 20 వేలని రవి చంద్రారెడ్డి తెలిపారు… కాగా కొద్ది కాలంగా పవన్ మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే…