సీటీమార్’పైనే గోపీచంద్ ఆశలు..!!

సీటీమార్'పైనే గోపీచంద్ ఆశలు..!!

0
93

గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘సీటీమార్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో కథానాయికలుగా తమన్నా, దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా నిరి్మస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది.

కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. . రాజమండ్రి షెడ్యూల్‌ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను చిత్రబృందం ఢిల్లీలో ప్లాన్‌ చేసిందట. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.