ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరో కీలక బాధ్యతలను అప్పగించారు… ఇటీవలే సర్కార్ యువతకు ప్రత్యేక శిక్షణ కోసం నైపుణ్యాభివృద్ది, శిక్షణ విభాగం పేరిట పాలనా శాఖను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే…
ఈ శాఖకు మేకపాటి గౌతమ్ రెడ్డిని నియమించింది… ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉత్తర్వులు కూడా జారీ చేశారు…. కాగా ప్రస్తుతం గౌతమ్ రెడ్డి జగన్ కెబినెట్ లో పరిశ్రమల వాణిజ్య శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే…
జగన్ ఆయనకు మంత్రి పదవి కేటాయించినప్పటినుంచి రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువచ్చారు… అందుకే జగన్ ఆయనకు మరో బాధ్యతను అప్పగించారు…