జగన్ ఆ ఒక్కటి గుర్తుపెట్టుకో… లోకేశ్

జగన్ ఆ ఒక్కటి గుర్తుపెట్టుకో... లోకేశ్

0
83

రైతులపై దాడి చేయించి రైతు ద్రోహిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత దిగజారారని టీడీపీనేత లోకేశ్ ఆరోపించారు.. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు కూడా చేశారు… ప్రజల్ని ఒప్పించలేని వారు దాడులకు తెగబడతారని అన్నారు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవు అన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందనే ఆందోళన జగన్ మోహన్ రెడ్డిని వెంటాడుతోందని లోకేశ్ తెలిపారు.

అందుకే వైసీపీ రౌడీలను రంగంలోకి దింపి శాంతియుతంగా రైతులు దీక్ష చేస్తున్న తెనాలి అమరావతి జేఏసీ శిబిరానికి నిప్పు అంటించారని ఆరోపించారు.రైతులు, మహిళల పై విచక్షణారహితంగా వైసీపీ గుండాలు దాడులు చేసారని లోకేశ్ మండిపడ్డారు. తెనాలిలో వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తుమని లోకేశ్ అన్నారు..

జగన్ మోహన్ రెడ్డి తాటాకు చప్పుళ్ళకు భయపడే వారు ఎవరూ లేరని లోకేశ్ హెచ్చరించారు… రైతుల పై చెయ్యి వేసిన వాళ్ళు నాశనం అయిపోతారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు లోకేశ్