వివాదంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ

వివాదంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ

0
95
vijay devarakonda

యువ హీరో విజయ్ దేవరకొండకు వివాదాలేం కొత్త కాదు. అర్జున్ రెడ్డి సినిమా ఎంత వివాదాస్పదమైందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ వివాదాలే విజయ్ సినిమాకు మంచి ప్రచారాస్త్రాలుగా మారాయి. తాజాగా నోటా సినిమాపై కూడా వివాదాలు ముసురుకుంటున్నాయి. నోటా సినిమా తమిళ్, తెలుగులో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

తమిళ్‌లో నోటా ట్రైలర్ రిలీజ్ పోస్టర్‌పై టైటిల్‌ను అదే భాషలో ముద్రించిన చిత్రబృందం… తెలుగు టైటిల్‌ను మాత్రం ఇంగ్లీషులో ముద్రించింది. ఇదే వివాదానికి కారణమవుతోంది. నోటా మూవీ పోస్టర్లు తమిళ్ లిపిలో వేసి, తెలుగు పోస్టర్లు మాత్రం ఆంగ్లంలో వేశారు. తెలుగు అంటే అంత చులకనా? పోస్టర్ల డిజైన్లలో ఇంత వివక్ష ఎందుకు? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే తరహాలో యూ టర్న్ పోస్టర్‌ను కూడా తప్పు పడుతున్నారు నెటిజన్లు. మన మాతృభాష కాని తమిళ్‌కి అంత విలువ ఇచ్చి.. మన మాతృభాష విషయంలో ఎందుకంత తేడా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు