జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వైద్యులు బాలికలకు ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా ఓ దారుణం చోటు చేసుకుంది వైద్యపరీక్షల్లో 12 సంవత్సరాల బాలిక ప్రెగ్నెంట్ అని వైద్యపరీక్షల్లో తేలడంతో వైద్యులు విస్తోలుపోయారు…
ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది… బాలిక తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అనాథగా మిగిలింది… అదే జిల్లా మందస మండలంలోని బుడారిసింగి పంచాయితీ పరిధిలో గుడ్డికోలకు చెందిన యువకుడు తనకు మేనకోడులు అయ్యే ఆ బాలికను ఆశ్రయం కల్పించాడు…
ఇటీవలే ఆమెను వివాహం చేసుకున్నాడు శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వైద్యులు బాలికళలకు వైద్యపరిక్షలు చేశారు… ఈ పరిక్షల్లో ఆ బాలిక గర్భవతి అని తేలింది… దీంతో వైద్యులు విస్తోలుపోయి ఐటీడీఏ అధికారులకు సమాచారం ఇచ్చారు… వారు గ్రామానికి చేరుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు…