కరోనా వైరస్ గురించి నమ్మలేని నిజాలు జాగ్రత్త తప్పక తెలుసుకోండి

కరోనా వైరస్ గురించి నమ్మలేని నిజాలు జాగ్రత్త తప్పక తెలుసుకోండి

0
108

ప్రతీ ఏడాది ఏదో ఓ వైరస్ మనిషి ప్రాణాలని హరిస్తోంది.. మొన్నటి వరకూ నిఫా వైరస్ అందరిని టెన్షన్ పెట్టింది, తాజాగా కరోనా వైరస్ అందరిని భయపెడుతోంది… ఈ వైరస్ లు ఎక్కడో ఓచోట పుట్టడం జనాల ప్రాణాలని పొట్టన పెట్టుకోవడం చేస్తున్నాయి.

ఈ కరోనా వైరస్ చైనాలో ప్రజలను ఇప్పటికే బెదర కొట్టేసింది.. అతి వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది, ఇది ఒక క్రిమి అని చాలా ఈజీగా ఒకరి నుంచి మరొకరికి వస్తుంది అని చెబుతున్నారు వైద్యులు.

ఇది కొన్ని కరొనా వైరస్ల సమూహంగా చెబుతున్నారు.. జంతువులకు మాత్రమే వ్యాపిస్తాయి.. కానీ, ఇందులోనే కొన్ని వైరస్లు మానవులను కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే ఇది జనాలకి కూడా జంతువుల నుంచి వస్తోంది.
మనిషికి ఈ కరోనా వైరస్ వచ్చింది అంటే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి.

ఇదే ప్రభావం తీవ్రమైతే న్యూమోనియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. ఈ వైరస్ లో ప్రాణాంతక క్రిములు ఎన్నో ఉంటాయి. అందుకే జలుబు దగ్గు వారం కంటే ఎక్కువ ఉంటే కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి.