ఏపీలో అని అనుకుంటున్నారా, కాదు కొత్తగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సరికొత్త అడుగులు వేద్దామని, రాష్ట్ర అధికారిక లోగో మార్పు నుంచి దీన్ని ప్రారంభిద్దామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్ పిలుపునిచ్చారు.
రిపబ్లిక్‌డే ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించబోయే లోగోకు నిపుణులు, మేధావులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాత లోగో కాకుండా కొత్త లోగో అక్కడ ఏర్పాటు చేయనున్నారు.
జార్ఖండ్ సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించేలా లోగో రూపకల్పన ఉంటుందని, ఇందుకు అన్నివర్గాలు తమవంతు చేయూత అందించాలని కోరారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో జార్ఖండ్ ముక్తిమోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ సంయుక్త కూటమి విజయం సాధించింది, హేమంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది మేధావులు ఈ లోగో కోసం తమ డిజైన్లు అలాగే సూచనలు ఇవ్వనున్నారు.