ఏపీలో శాసనమండలి రద్దు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు కేంద్రంతో చర్చించకుండా ఎలా ముందుకు వెళ్లారు అనేది ఏపీలో అందరి ఆలోచన.. అయితే తెలుగుదేశం పార్టీకి ఇదే ఆలోచన. అసలు కేంద్రం ఒఫ్పుకుంటుందా అసలు ఇది జరుగుతుందా అనే చర్చ జరుగుతుంది, కాని సీనియర్లు రాజకీయ విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం చూస్తే, అసలు దీనికి పాత్రదారి సూత్రదారి జగన్ అమిత్ షా అంటున్నారు.
రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ప్లేస్ లోకి బీజేపీ రావాలి అని చూస్తోంది…ఈ సమయంలో తెలుగుదేశం పార్టీకి మండలిలో బలం ఉంది కాబట్టి అక్కడ చెక్ పెడితే కేవలం టీడీపీకి రాజ్యసభ సభ్యులు అలాగే ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు అనేది ప్లాన్ ..అందుకే మండలి రద్దు విషయంలో కేంద్రం ఏపీలో జగన్ సర్కారుకి సపోర్ట్ ఉంటుంది అంటున్నారు.
అంతేకాదు ఉన్న ఆరు రాష్ట్రాల్లో మండల్లు రద్దు చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నారు కేంద్రం నుంచి, ఆయా రాష్ట్రాలు ఒప్పుకుంటే దేశంలో మండలి వ్యవస్ధ తీసేయాలి అని మోదీ సర్కార్ భావిస్తోంది, ఈ సమయంలో రద్దు చేయండి అని వారికి వారే అడుగుతుంటే ఎందుకు కేంద్రం ఒఫ్పుకోదు అందుకే ఎస్ చెబుతుంది అంటున్నారు. దీనికి అమిత్ షా ఒకే చెప్పారని అందుకే ఈ నిర్ణయంలో జగన్ ముందుకు అడుగు వేశారు అని అంటున్నారు.