ఈ శుక్రవారం దియేటర్లకు వచ్చిన c/o కంచరపాలం సినిమాకి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. ఈ సినిమాకి ఇప్పటికే పలువురు ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కించుకుంది.. ఇక తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మహేష్ చిత్రంపై మాట్లాడుతూ క్లాస్ కు దూరంగా ఉన్న చిత్రమిదని, ఇది నిజంగా ‘డైరెక్టర్స్ ఫిల్మ్’ అని ప్రశంసించారు. అద్భుతంగా పాత్రలను రచించారని,
ఈ చిత్రంలో క్లైమాక్స్ ఈ సినిమాకు హృదయం లాంటిదని, తొలి సినిమానే అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వెంకటేశ్ మహాకు శుభాకాంక్షలు చెప్పిన మహేశ్ బాబు, తనకు ఈ సినిమా బాగా నచ్చిందని ప్రశంసించారు. కొత్త నటీనటులతో నిర్మించినందుకు, ఇలాంటి నైపుణ్యాన్ని ప్రోత్సహించిన దగ్గుబాటి రానాను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని మహేశ్ అన్నాడు