కేజీఎఫ్ 2 గురించి మతిపోయే అప్ డేట్

కేజీఎఫ్ 2 గురించి మతిపోయే అప్ డేట్

0
84

కేజీఎఫ్ ఈ సినిమా క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా థియేటర్లో చూడాలి అని ప్రతీ ఒక్కరూ కూడా మౌత్ పబ్లిసీటీ చేశారు అంతలా మాస్ క్లాస్ ప్రేక్షకులకి నచ్చింది, అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమా సంచలన విజయం రికార్డు నమోదుచేసింది, అంతేకాదు ఇది కన్నడ నుంచి అన్ని భాషల్లో డబ్ అయింది, నిర్మాతలకు కాసుల పంట పండింది.

వెంటనే హిట్ టాక్ రావడంతో ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు – హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దిగారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అప్ టేడ్ వచ్చినా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇందులో ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టు పై క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది… అయితే కేజీఎఫ్ పార్ట్ 2 ప్రస్తుతం మైసూర్ లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఇక సినిమా ఫైనల్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారట, చివరి షెడ్యూల్ ని హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. క్లైమాక్స్ కి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తారట.సినిమాకి హైలెట్ సీన్స్ ఇక్కడ షూట్ చేయనున్నారు అని తెలుస్తోంది.