17 మంది అసెంబ్లీకి ఎందుకు రాలేదు జగన్ వారిని ఏం చేశారు

17 మంది అసెంబ్లీకి ఎందుకు రాలేదు జగన్ వారిని ఏం చేశారు

0
78

ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం పెనుసంచలనం అయింది.. అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరిపారు ఆ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు, అయితే ఈ సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా 133 ఓట్లు మాత్రమే పడ్డాయి. అదేంటీ… వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 151 కదా. స్పీకర్ ఓటును పక్కనపెడితే… 150 ఓట్లు పడాలి కదా అని అందరూ భావించారు కాని ఇక్కడే సీన్ మారింది.

వైసీపీ ఎమ్మెల్యేల్లో ఏకంగా 17 మంది సోమవారం సభకు డుమ్మా కొట్టారని వార్తలు వస్తున్నాయి.. అందుకే ఫ్లోర్ టెస్టులో 17 ఓట్లు తగ్గాయి అంటున్నారు. అయితే ఇది వాస్తవం కాదు అని అంటున్నారు. కొందరు అనారోగ్యంతో సభకు రాలేదు కాని ఇందులో పది మంది వరకూ సభకు వచ్చినా ఓటింగ్ లో పాల్గొనలేకపోయారట. అయితే ఇలా ఎందుకు జరిగింది అంటే.

ఈ ఎమ్మెల్యేల్లో విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు లాబీల్లో చిక్కుకుపోయారట. ఓటింగ్ సమయంలో లాబీ డోర్లు మూసివేస్తారు. దీంతో బయటకు వెళ్లిన వారు లోపలికి రాలేకపోయారు. అందుకే ఇలా జరిగిందట, వైసీపీలో అందరూ జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలియచేస్తున్నారు పార్టీ నేతలు. అయితే సభకు రానివారి గురించి విప్ ల ద్వారా సమాచారం తెలుసుకున్నారట సీఎం జగన్.