విజయవాడ బస్టాండ్ పేరు చెబితే వెంటనే చెప్పేమాట మన ఆసియాలోనే అతిపెద్ద రెండోవ బస్టాప్ అంటారు.. అవును హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే ఇంత పెద్ద బస్ స్టాప్ లేదు, తాజాగా ఇక్కడ పీఎన్బీఎస్లో వినోదానికి బ్రేక్ పడింది…బస్స్టేషన్లో వై స్ర్కీన్స్ సినిమా థియేటర్లను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు.
ఆర్టీసీకి దాదాపుగా రూ.కోటి మేర ఆ సంస్థ బకాయిలు పడటంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కొంతకాలంగా కాంట్రాక్టు సంస్థ యాజమాన్యంతో ఆర్టీసీ యాజమాన్యం సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో మంగళవారం సీజ్ చేయాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ తీసుకుంది. దీంతో చాలా మంది నిరాశ చెందుతున్నారు
ఆర్టీసీ అధికారుల లెక్కల ప్రకారం వై స్ర్కీన్స్ గత ఆరు నెలలుగా రూపాయి కూడా అద్దెలు చెల్లించటం లేదు. నెలకు రూ. 8 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇదే క్రమంలో గతంలో పాత బకాయిలు కొంత ఉన్నాయి. వీటికి వడ్డీ కలిపితే మొత్తంగా రూ. 94 లక్షల మేర బకాయిలు పేరుకుపోయాయి వారి వ్యాపారం వారుచేసుకుంటున్నా డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. దీంతో ఆ కాంట్రాక్టుని ఆర్టీసీ రద్దు చేసుకుంది, పాపం సినిమాకి వచ్చేవారికి మాత్రం కష్టాలే.