మన దేశంలో పవిత్రమైన మొక్కలు, చెట్లకు లెక్క లేదు. వాటిలో రావి చెట్టుకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ చెట్టును పవిత్ర చెట్టుగా ఎందుకు భావిస్తారంటే దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మలబద్ధకం, విరేచనాలు, నపుంసకత్వం, రక్త సంబంధ సమస్యలకు ఈ ఆకులు చెక్ పెడతాయి. ఎందుకంటే రావి ఆకులో గ్లూకోజ్, ఆస్టియోరిడ్, ఫినోలిక్ వంటి గుణాలున్నాయి.
ఆ మాటకొస్తే రావి చెట్టులో ప్రతీ భాగంలోనూ ఔషధ గుణాలున్నాయి. అందుకే ఈ చెట్టును రకరకాల వ్యాధుల్ని తరిమికొట్టేందుకు ఉపయోగిస్తున్నారు. ఓవైపు ఈ చెట్టుకు పూజలు చేస్తూనే మరోవైపు దీని ఆకులు, బెరడు, కాండం, విత్తనాలు, పండ్లను ఔషధాల తయారీలో వాడుతున్నారు.