వైఎస్సార్ కాపు నేస్తానికి అప్లై చేసుకునే వారికి ఉండాల్సిన కనీస అర్హతలు ఇవే

వైఎస్సార్ కాపు నేస్తానికి అప్లై చేసుకునే వారికి ఉండాల్సిన కనీస అర్హతలు ఇవే

0
113

వైఎస్సార్ కాపునేస్తం పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద కాపు మహిళలకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఐదేళ్లలకు రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలకు వైఎస్సార్ కాపు నేస్తం పథకం వర్తిస్తుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా.. కాపు కులాల్లో ఉన్న పేద మహిళలను ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గతంలో సీఎం ప్రకటించారు.

పథకం వర్తించడానికి నిబంధనలు…

గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఆదాయం కలిగి ఉండాలి

వ్యవసాయ భూమి 3 ఎకరాలు పైన ఉన్నా లేక 10 ఎకరాలకు మించిన మెట్ట భూమి ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులు

కారు, ట్రాక్టర్ వంటి 4 చక్రాల వాహనాలు లేని దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారు మాత్రమే వైఎస్సార్ కాపు నేస్తానికి అర్హులు.

ప్రభుత్వ ఉద్యోగం చేసే కాపు మహిళలు ఈ పథకానికి అనర్హులు.

కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను కడుతున్నా ఈ పథకం వర్తించదు.