ఓ మెడికల్ షాపులో వీరు ఎంత దారుణం చేశారో తెలిసి షాకైన అధికారులు

ఓ మెడికల్ షాపులో వీరు ఎంత దారుణం చేశారో తెలిసి షాకైన అధికారులు

0
80

కొంత మంది కక్రుత్తి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, అవతల వారు పోయినా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా వీరు మాత్రం బాగోవాలి బాగుపడాలి అనుకుంటారు ..సరిగ్గా చెప్పాలి అంటే శవాల పై పేలాలు ఏరుకునే బాపతు వ్యక్తులు కొందరు ఉంటారు, అయితే తాజాగా చైనా కరోనా వైరస్ తో వణికిపోతోంది.

బయటకు రావాలి అంటేనే భయపడిపోతున్నారు, అంతేకాదు స్కూల్ కి కూడా ఎవరూ వెళ్లడం లేదు.. ఆఫీసుకి వెళ్లినా తిరిగి వచ్చేసరికి జబ్బు చేస్తోంది. అందుకే ఇంటి పట్టున ఉంటున్నారు, అయితే ఈ వైరస్ చాలా వరకూ రాకూడదు అంటే మాస్క్ ధరించాలి అని చైనా అంతా ప్రభుత్వం చెప్పింది. కొందరికి ఉచితంగా మాస్క్ లు ఇస్తోంది.

అయితే మరికొందరు మాత్రం కంపెనీ మాస్క్ లు ధరిస్తున్నారు. ఈ సమయంలో కొన్ని కంపెనీలు విపరీతంగా ఈ మాస్క్ ధరలు పెంచేశాయి.
మామూలు రోజుల్లో అమ్మే ధర కంటే కరోనా తర్వాత దాదాపు ఆరు రెట్లు ఎక్కువ ధరకు ఎన్95 మాస్క్లను బీజింగ్లోని జిమిన్ కంగ్టై ఫార్మసీ విక్రయిస్తున్నట్లు బీజింగ్ మున్సిపల్ మార్కెట్ రెగ్యులేటర్ తేల్చింది. దీంతో.. మాస్క్ల ధరలు అమాంతం పెంచేసిన ఆ ఫార్మసీకి 3 మిలియన్ యుయాన్లుభారత కరెన్సీలో రూ.3.08 కోట్లు జరిమానా విధించింది. ఇప్పటి వరకూ వీరు అధికంగా సంపాదించిన సొమ్ము ఎంత అయితే ఉందో అంతా తిరిగి కట్టించుకున్నారు, అంతేకాదు మరోసారి ఇలా అమ్మితే నేరుగా కంపెనీ మూయించేస్తాము అన్నారు, దీంతో గతంలో ఎంత రేటు అమ్మారో అంతే అమ్ముతున్నారు.