రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాల్లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు, పవన్ కల్యాణ్ పింక్ సినిమా షూటింగులో కూడా పాల్గొన్నారు, ఇక దీనిపై ఒక్క ఫోటో కూడా బయటకు రాకూడదు అని అనుకున్నారు కాని పవన్ కల్యాణ్ షూటింగ్ పిక్స్ వీడియోలు కూడా బయటకు వచ్చేశాయి.
చాలా మంది పవన్ అభిమానులు ఈ రీమేక్ సినిమా ఎందుకు డైరెక్ట్ సినిమా చేయవచ్చు కదా అని కోరుకుంటున్నారు.. అయితే పవన్ ఈ మధ్య పలు సినిమా స్టోరీలు విన్నా ఈ కథ నచ్చి చేస్తున్నారట.. అయితే ఫ్యాన్స్ ఈ ఫీల్ తో ఉన్నారు అని తాజాగా పింక్ తెలుగు వెర్షన్ లో పవన్ క్యారెక్టర్ లో మార్పులు చేర్పులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా సేమ్ అలాగే ఉంటుంది అని అందరూ అనుకుంటున్న వేళ ఈ మార్పుల వార్త కాస్త అభిమానులకి ఆశ్చర్యం కలిగిస్తోంది. తమిళ్ లో అజిత్ చేసిన క్యారెక్టర్ చూస్తే కాస్త డల్ ఉంటుంది. కాని పవన్ కు ఇక్కడ మాత్రం కాస్త ఆరోగెన్సీగా ఉంటుంది అని తెలుస్తోంది, ఇక్కడ హీరోయిజం హైలెట్ చేయబోతున్నారట ఇది పవన్ ఫ్యాన్స్ కోసం అని టాక్ నడుస్తోంది.