మెగా హీరోతో క్రిష్ మరో సినిమా

మెగా హీరోతో క్రిష్ మరో సినిమా

0
84

క్రిష్ ప్రస్తుతం ఏ సినిమా కూడా స్టార్ట్ చేయలేదు… కాని పవన్ కల్యాణ్ తో నెక్స్ట్ ఆయనే చిత్రం చేస్తున్నారు అని తెలుస్తోంది.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పింక్ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా అయిన తర్వాత క్రిష్ ఆయనతో సినిమా చేయనున్నారట.

మొఘల్ రాజుల కాలం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ ఒక దొంగగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ భారీ చారిత్రక చిత్రానికి ఎ.ఎమ్. రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి క్రిష్ మిగిలిన సినిమా వర్క్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి అని తెలుస్తోంది.

ఇక ఆ తరువాత ప్రాజెక్టును కూడా క్రిష్ లైన్లో పెట్టేశాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. అవును మళ్లీ మెగా హీరోతో ఆయన సినిమా చేయనున్నారు, వరుణ్ తో గతంలో క్రిష్ కంచె సినిమా తీశారు తాజాగా మళ్లీ వరుణ్ తో సినిమా చేయనున్నారట, దీనిపై వచ్చే నెల ప్రకటన విడుదల కానుంది.