ఆమంచికి గుడ్ న్యూస్ చెప్పిన జగన్

ఆమంచికి గుడ్ న్యూస్ చెప్పిన జగన్

0
123

ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి.. గతంలో లా వర్గపోరు వస్తుందా అనే అనుమానం కొన్ని సెగ్మెంట్లలో కనిపిస్తోంది, దీనికి ప్రధాన కారణం కూడా ఉంది ..పార్టీ మారాలి అని చూస్తున్న నేతలు ఓటమి పాలైన వారు కూడా అధికార పార్టీలోకి వస్తున్నారు.. అలాగే గెలిచిన వారు కూడా అధికార పార్టీలోకి వస్తున్నారు.

ఈ సమయంలో అక్కడ వైసీపీ తరపున ఉన్న నేతలకి ఎలాంటి ప్రయారిటీ ఉంటుంది అనే అనుమానం కలుగుతోంది. ,తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ పోతుల సునీత చీరాల నుంచి వైసీపీలో చేరిపోయారు.

అయితే ఇక్కడ ఇప్పటి వరకూ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న ఆమంచి క్రిష్ణ మోహన్ కు ఇక బాధ్యతలు ఉండవు అని ఆయనకి మరో పదవి ఇస్తారు అని వార్తలు వినిపించాయి. కాని తాజాగా ఆయనకే అక్కడ ఇంచార్జ్ పదవి అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియచేశారు, దీంతో ఆయన వర్గం చాలా సంతోషంలో ఉన్నారు.