15 ఏళ్ల అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి – చివరకు ఏం చేసిందో తెలిస్తే షాక్

15 ఏళ్ల అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి - చివరకు ఏం చేసిందో తెలిస్తే షాక్

0
92

ఇష్టం లేని పెళ్లి చేయడం, చిన్న వయసులో పెళ్లి చేయడం, మైనార్టీ తీరకుండానే పెళ్లి చేయడం, చదువుకుంటాను అంటే పెళ్లి చేయడం, ఇవన్నీ అమ్మాయిలకి చాలా పెద్ద ఇబ్బందులు.. పెళ్లికి ఒప్పుకోకపోతే తల్లిదండ్రుల పరువు పోతుంది అని చాలా మంది మెడ వంచి తాళికట్టించుకుంటారు. మరికొందరు మాత్రం మా ఇష్టానికి ఇలా విరుద్దంగా పెళ్లి చేయడం ఏమిటి అని రివర్స్ అవుతూ ఉంటారు.

తాజాగా బెంగళూరులోని హోబళిలోని ఓ అమ్మాయి ఇలాంటి పనే చేసింది.. తన వయసు 15 సంవత్సరాలు అప్పుడే పెళ్లి వద్దు అని చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు, పెళ్లి చేయాలి అని భావించారు, దగ్గర బంధువుతో పెళ్లి నిశ్చయం చేశారు.. బంధువైన యువకుడితో ఈనెల 30న వివాహం చేయడానికి నిశ్చయించారు. అయితే ఎంత వద్దు అన్నా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దీనిపై కంప్లైంట్ ఇవ్వాలి అని ఫిక్స్ అయింది, ఫేస్ బుక్ ని సరైన మార్గంగా ఎంచుకుంది.

మొత్తం విషయాన్ని ఫేస్బుక్ ఖాతా ద్వారా బెంగళూరు నగర పోలీసులకు విషయాన్ని వివరిస్తూ పోస్ట్ పెట్టింది. ఇది గమనించిన బెంగళూరు పోలీసులు వెంటనే మైసూరు పోలీసులకు విషయాన్ని చేరవేయడంతో అప్రమత్తమైన మైసూరు పోలీసులు వెంటనే మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. అసలు మైనర్ బాలికకి పెళ్లి ఎలా చేస్తారు అని తల్లిదండ్రులకి వార్నింగ్ ఇచ్చారు. అరెస్ట్ చేస్తాము అని చెప్పారు, కావాలి అంటే మైనార్టీ తీరాక పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయింది, బాలిక మాత్రం హ్యాపీగా ఉంది.