మంత్రి మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవి పై ఆసక్తికర వ్యాఖ్యలు

మంత్రి మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవి పై ఆసక్తికర వ్యాఖ్యలు

0
76

ఏపీ రాజకీయాల్లో శాసనమండలి రద్దు గురించి బాగా చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా జగన్ ఈ సమయంలో తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం నేతలు తమ పదవులు కోల్పోతున్నారు.. ఏకంగా నారాలోకేష్ కూడా తన ఎమ్మెల్సీ పదవి వదులుకుంటున్నారు, ఈ సమయంలో వైసీపీ నుంచి ఇద్దరు మంత్రులు శాసనమండలిలో సభ్యులుగా ఉన్నారు.

అయితే వారు కూడా పదవి కోల్పోనున్నారు కాబట్టి మంత్రి పదవులు కూడా వదులుకోవాల్సిందే, తాజాగా వీరికి అనేక పదవులు జగన్ ఆఫర్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి, అంతేకాదు తదుపరి రాజ్యసభకు ఎంపీగా అవకాశం వీరిద్దరిలో ఒకరికి వస్తుందని, మళ్లీ మధ్యలో మరొకరికి రాజ్యసభ ఎంపీ అవకాశం ఇస్తారు అని అంటున్నారు.

కాని దీనిపై వైసీపీ నేత మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దయితే తన మంత్రి పదవి పోతుందన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్రానికి మంచి జరగడం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు. పార్టీ నుంచి తనకు భరోసాలు ఏమీ లేవని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకే జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. తాము అవసరం అయిన సమయంలో రాజీనామా చేస్తాము అని చెప్పారు, తమకు ఎలాంటి హామీ ప్రస్తుతం లేదు అని క్లారిటీ ఇచ్చారు, సో బయట చర్చ మాత్రం వారికి రాజ్యసభ సీటు అని జరుగుతోంది.