ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్

ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్

0
83

దేశవ్యాప్తంగా నేడు, రేపు బ్యాంకులు మూతపడనున్నాయి అనే విషయం తెలిసిందే, ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిచడం లేదని బ్యాంకు ఉద్యోగులు అనూహ్యంగా సమ్మెకు వెళుతున్నారు, అయితే రెండు రోజులు బ్యాంకులు ఉండవు అనేసరికి వ్యాపారులు సామాన్యులు చాలా వరకూ షాక్ అయ్యారు.

దేశవ్యాప్తంగా మొత్తం 60 వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. నవంబరు 2017 నుంచి వేతన సవరణ పెండింగులో ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలంటూ ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ 20 సార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి సమ్మెకు దిగాలని నిర్ణయించుకుంది. అన్నీ బ్యాంకులు ఈ సమ్మెలో ఉన్నాయి.

అయితే శుక్రవారం శనివారమే కాదు ఆదివారం కూడా బ్యాంకులు సెలవు, మళ్లీ సోమవారం పని చేస్తాయి,. అయితే, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు మాత్రం ఈ సమ్మె ప్రభావం లేదు. ఈ రెండు బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని ఆ బ్యాంకు వర్గాలు తెలిపాయి. దీంతో ఆ బ్యాంకు కస్టమర్లు మాత్రం సంతోషంలో ఉన్నారు.