పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేనాని ఇటు పింక్ సినిమా చేస్తూ ఆ షూటింగ్ ముగించుకుని, రాజధాని రైతుల సమస్యలపై పోరాటంచేస్తున్నారు.. రాజధాని రైతుల కోసం వారి వెంట ఉంటున్నారు.. ఈ సమయంలో ఆయన పింక్ తర్వాత మరో సినిమా చేస్తే బాగుండేది అని అందరూ అనుకుంటున్న సమయంలో.
పవన్ క్రిష్ సినిమా కూడా స్టార్ట్ అయింది అని వార్తలు వస్తున్నాయి..క్రిష్ సినిమాకోసం పవన్ వెంటపడడంతో, ఆ సినిమా కు కూడా క్లాప్ కొట్టి, ఓ నాలుగు రోజులు షూట్ చేసి వదలాలనుకున్నారు అనే వార్తలు ఇటీవల వినిపించాయి. తాజాగా ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు అని తెలుస్తోంది.
అయితే పవన్ మరో సినిమా కూడా చేస్తారు అని తెలుస్తోంది.. మూడో సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత మూడో చిత్రం చేస్తారట.