ఏపీ సీఎం జకర్ రెడ్డిగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలోని త్రిశూల్ సిమెంట్స్ కంపెనీ దివాకర్ రెడ్డిది కావడంతో ఆ కంపెనీకి ఇచ్చిన సున్నపురాయి లీజుని ప్రభుత్వం రద్దు చేసింది.
జగన్ ఫ్యాక్షనిజం, ఫ్యాక్షనిజం అని రగిలిపోతున్నారని జేసీ ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎవరినైనా టార్గెట్ చేస్తే వాడు సర్వనాశనం అవుతాడని, వాడి భార్య పిల్లలు అడుక్కుతింటుంటే చూస్తూ ఆనంద పడాలని ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు.
లీజు వ్యవహారం కోర్టులో తేల్చుకుంటామని జేసీ తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న నష్టం కంటే తనకు జరిగే నష్టం చాలా చిన్నదన్నారు. ఇప్పటికైనా ఏపీ సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే చాలా మంచిది. లేకపోతే తన తండ్రిలాగా పుట్టగతులు లేకుండాపోతాడని వ్యాఖ్యానించారు.