హీరోలు పెళ్లిళ్ల వార్తలు ఈ మధ్య బాగానే వినిపిస్తున్నాయి, నితిన్ వివాహం పై క్లారిటీ వచ్చేసింది, డేట్ కూడా ప్రకటించారు, తాజాగా ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లి వార్త వినిపిస్తోంది, అయితే ఆ హీరో ఎవరు అనేగా మీ డౌట్ అతనే
హిట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఈ మధ్య నిలుస్తున్న హీరో నిఖిల్.
తాజాగా అర్జున్ సురవరం చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. తాజా వార్తల ప్రకారం నిఖిల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఏప్రిల్ 16న నిఖిల్ వివాహం జరగనుంది. ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు హాజరైన ఓ కార్యక్రమంలో పెళ్లి నిశ్చయం చేసుకున్నారు.
ఆ అమ్మాయి పేరు పల్లవి వర్మ, ఆమె ఓ డాక్టర్ గా చేస్తున్నారు, వారిది గోదావరి జిల్లాలోని భీమవరం అని తెలుస్తోంది, వారు ఈ మధ్య గోవాలో ఐస్ ఐలాండ్ దగ్గర దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి, ఇక మరో హీరో కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.