చైనాలో కరనో వైరస్ సోకి చనిపోతే వారిని ఏంచేస్తున్నారో చూస్తే కన్నీరే

చైనాలో కరనో వైరస్ సోకి చనిపోతే వారిని ఏంచేస్తున్నారో చూస్తే కన్నీరే

0
99

చైనా పేరు చెబితే ఇప్పుడు అందరూ కరోనా గురించే చెబుతున్నారు, అయితే దేశంలో దాదాపు 40 కోట్ల మందిపై దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది, సుమారు 320 మంది ప్రాణాలు కోల్పోయారు.. 15000 మంది ఈ వైరస్ బారిన పడి ఆ లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నారు.

1600 మంది పరిస్దితి విషయంగా ఉంది.. అత్యవసర పరిస్దితి హెల్త్ పై అక్కడ ప్రకటించారు, అయితే ఇక్కడ పిట్టల్లా జనం రాలిపోతున్నారు, కుటుంబాలు కూడా వ్యాధి సోకిన వారిని కలవకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు, ప్రత్యేకంగా వారికి చికిత్స అందిస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా మరణించినవారి అంతిమ సంస్కారాలపై చైనా కఠిన ఆంక్షలు విధించింది.
ఆర్భాటంగా అంత్యక్రియలు నిర్వహించవద్దని, దగ్గర్లో ఉన్న శ్మశానవాటికలో వెంటనే అంత్యక్రియలు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. మృతదేహాలను దూరప్రాంతాలకు తీసుకెళ్లవద్దని, వాటిని ఎక్కువసేపు భద్రపరచవద్దని సూచించింది. దాదాపు ఐదు గంటల్లో అన్నీ పూర్తి చేయాలి అని చెప్పారు. లేకపోతే మేమే అంతిమ సంస్కారాలు చేస్తాము అని చైనా అధికారులు హుకుం జారీ చేస్తున్నారట.