సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలి అని వర్మ భావిస్తున్నారు అనేది తెలుస్తోంది .. తాజాగా దిశ ఘటన పై ఆయన చలించిపోయారు.. ఇక నిర్భయ కేసులో నలుగురు నిందితుల ఉరితీతలో ఆలస్యం పై కూడా ఆయన విమర్శలు చేశారు, అయితే తాజాగా ఆయన దిశ ఘటనపై సినిమా అనౌన్స్ చేయడంతో ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు, అయితే ఇది పూర్తిగా సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా అని చెప్పాల్సిందే.
ఆర్జీవీ దిశ నిందితులలో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకని ఇటీవల కలుసుకున్నారు…ఆమెని తన ఆఫీస్ కి పిలిపించి ఆమెతో మాట్లాడారు..చెన్నకేశవులుతో ఆమె ప్రేమ, పెళ్లి గురించి విషయాలు అడిగి తెలుసుకున్నారు.. రేణుకని కలిశాను అనే విషయం కూడా ఆయన ట్వీట్ లో చెప్పారు, రేణుకకి 16 ఏళ్లకే పెళ్లి అయింది. ఇప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాలు. ఆమె ఓ బిడ్డకి జన్మనివ్వబోతోంది అని అన్నారు.
వర్మ తనలో ఉన్న మరో యాంగిల్ ని కూడా బయట పెట్టినట్లు తెలుస్తుంది. రేణుకకి లక్షరూపాయల చెక్ ఇచ్చి ఆమెకి భరోసాకి ఆర్ధిక సాయం చేసినట్లు తెలుస్తుంది ..అయితే వర్మ ఇలా సాయం చేయడం గతంలో చాలా సార్లు ఉందట, కాని బయటకు వార్తలు రాలేదు, ఇప్పుడు ఈ సాయం కూడా బయటకు రానివ్వలేదు అని తెలుస్తోంది. కాని దీనిపై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.