టాలీవుడ్ డైరెక్టర్స్ కి పెద్ద పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్

టాలీవుడ్ డైరెక్టర్స్ కి పెద్ద పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్

0
86

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో అల వైకుంఠపురం సినిమా బాగా హిట్ అయింది, ఈ సినిమా బన్నీ కెరియర్లో టాప్ హిట్ గా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ ఆనందంలో ఉన్నారు బన్నీ.. ఇక తరువాత సుకుమార్ సినిమాని కూడా పట్టాలెక్కించారు, ఇటు త్రివిక్రమ్ కూడా తరువాత సినిమా వర్క్ లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా హిట్ అవడంతో బన్నీ సంతోషం అంతాఇంతా కాదు. ఇక అల.. వైకుంఠపురములో చిత్ర విజయాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన నివాసంలో భారీ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి టాలీవుడ్ దర్శకులందరూ వచ్చారు.

సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఈ పార్టీకి హజరయ్యారు, అలాగే అల చిత్ర యూనిట్ మొత్తం హజరయ్యారు, ఇక టాలీవుడ్ లో ఈ మధ్య టాప్ సినిమాలు తీసిన చిన్న పెద్ద అందరూ దర్శకులు ఈ పార్టీకి హజరయ్యారు. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.