నానితో సాయిపల్లవి సినిమా ఎప్పుడో తెలుసా

నానితో సాయిపల్లవి సినిమా ఎప్పుడో తెలుసా

0
91

తమిళ…మలయాళ చిత్ర పరిశ్రమల్లో అభిమానులకి సాయిపల్లవి అంటే మంచి క్రేజ్.. ఆమెకు టాలీవుడ్ లో కోలీవుడ్ లో కూడా మంచి అభిమానులు ఉన్నారు.. ప్రస్తుతం ఆమె చైతూ జోడీగా లవ్ స్టోరీ.. రానా సరసన విరాటపర్వం చేస్తోంది.

ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పైనే వున్నాయి. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ తరువాత సినిమాను ఆమె నానితో కలిసి చేయనుందనేది తాజా సమాచారం.
హీరో నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఒక సినిమా చేయనున్నారు, అయితే ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి ని ఎంపిక చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాని ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఈ చిత్రాలు అవ్వగానే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారట. ఎంసీఏ సినిమా గతంలో వీరిద్దరి కాంబోలో హిట్ అయిన విషయం తెలిసిందే.