యాత్ర మూవీ రిలీజ్ ఆ రోజే

యాత్ర మూవీ రిలీజ్ ఆ రోజే

0
136

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం విడుదల తేదీని యూనిట్‌ సభ్యులు ఖరారు చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం వినాయక చవితి సందర్భంగా బుధవారం విడుదల చేసింది. ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా ఈ చిత్రాన్ని ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది.

ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అందుకు కొన్ని రోజుల ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలో జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్‌ తదితరులు నటిస్తున్నారు.