మంత్రి కొడాలి నాని బాటలో జనసేన నాయకుడు నాగబాబు

మంత్రి కొడాలి నాని బాటలో జనసేన నాయకుడు నాగబాబు

0
80

ఇప్పుడు ఎవరిని కదిలించినా కరోనా వైరస్ గురించే చెప్పుకుంటున్నారు.. చైనా దేశం ఈ వైరస్ తో అతలాకుతలం అవుతోంది, ఓ పక్క 450 మంది ఎఫెక్ట్ అయి మరణించారు.. 20 వేల మందికి ఈ వైరస్ ఎఫెక్ట్ అయింది, అయితే తాజాగా ఈ వైరస్ గురించి మీడియాపై సినీనటుడు, జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు సోకుతున్న కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందేమీ కానీ, మీడియాకు పట్టిన వైరస్ వదిలేలా లేదని ట్వీట్ చేశారు. అవును ఇప్పుడు ఎల్లో మీడియా అనే పేరుని చాలా మంది కరోనా వైరస్ అని అంటున్నారు. అలాగే కరోనా మీడియా అని కూడా అంటున్నారు.

కరోనా వైరస్ ప్రజల కంటే మీడియాకే వేగంగా వ్యాపిస్తోంది. 90 శాతం మీడియా ఈ భయంకర వైరస్ బారిన పడింది. కానీ, మరణాల గురించి నిర్ధారణ కాలేదు. నిజమైన కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నాను. అయితే, మీడియాకు పట్టిన వైరస్ మాత్రం వదులుతుందన్న ఆశ లేదు అని అన్నారు. ఇక దీనిపై నెటిజన్లు కూడా సూపర్ అంటున్నారు, అయితే ఈయనే కాదు ఇటీవల మంత్రి కొడాలి నాని కూడా ఈ ఎల్లో మీడియా కరోనా వైరస్ కంటే దారుణమైనది అంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.