దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమాని అనుకున్న సమయంలో రిలీజ్ చేస్తాము అని ముందు నుంచి చిత్ర యూనిట్ చెబుతూనే ఉంది.. అయితే చాలా మంది ఆలోచించారు జక్కన్న సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారా లేదా అని బాహుబలి కూడా అలాగే అన్నారు సినిమా విడుదల పోస్ట్ పోన్ అయింది
తాజాగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కూడా అలాగే ముందుకు జరిగింది.ఈ చిత్రాన్ని 2021, జనవరి 8న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేసింది.
చిత్రం స్టార్ట్ చేసిన సమయంలో ఈ ఏడాది జులైలో ఆర్ఆర్ఆర్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాని షూటింగ్ కు ఇంకా సమయం పడుతుంది అని తెలుస్తోంది, కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయింది అని అంటున్నారు. అయితే కొన్ని సీన్లకి షూట్ ముందు అవుతుంది అనుకున్నా, అది ఆలస్యం అవుతుంది అని భావించి ఇంకా డేట్ ని పొడిగించారు అని తెలుస్తోంది.