క్రిష్ పవన్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

క్రిష్ పవన్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

0
96

క్రిష్ సినిమాలు అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. పైగా క్రిష్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్నారు.. ప్లాప్ అనేది లేని డైరెక్టర్ గా ముద్ర వేసుకున్నారు ..చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలు చేయడంలో క్రిష్ చాలా దిట్ట అనే చెప్పాలి.. ఇక తాజాగా ఆయన బాగా గ్యాప్ తీసుకుని పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్నారు.

క్రిష్ ఈ సారి చారిత్రక నేపథ్యంతో కూడిన కథను సిద్ధం చేసుకున్నారు. ఈ స్టోరీ. ఆంగ్లేయుల పరిపాలనా కాలంకంటే ముందుగా
ఉన్న చరిత్ర కాలం నాటిది అని తెలుస్తోంది, దీనిలో పవన్ ఇప్పటి వరకూ చేయని పాత్ర బంధిపోటుగా చేయనున్నారు, అసలు ఈ వార్త రాగానే అందరూ ఆశ్చర్యపోయారు.

ఇక ఈ సినిమాకి ముందుగా ప్రగ్యా జైస్వాల్ పేరు తెరపైకి వచ్చింది. కాని తాజాగా ఈ చిత్రంలో కైరా అద్వాని పేరు వినిపిస్తోంది. ఆమెతో క్రిష్ చిత్ర యూనిట్ సంప్రదింపులు చేస్తున్నారట. ఇక హరీశ్ శంకర్ తో పవన్ చేయనున్న సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ ను తీసుకుంటున్న సంగతి తెలిసిందే.