హాజీపూర్ కిల్ల‌ర్ శ్రీనివాస‌రెడ్డికి ఉరిశిక్ష గ్రామ‌స్తులు ఏం చేశారో తెలుసా

హాజీపూర్ కిల్ల‌ర్ శ్రీనివాస‌రెడ్డికి ఉరిశిక్ష గ్రామ‌స్తులు ఏం చేశారో తెలుసా

0
102

అత్యంత దారుణంగా స్కూల్ నుంచి తిరిగి వ‌చ్చే పిల్ల‌ల‌ని మాటు వేసి మాయ‌మాట‌లు చెప్పి వారిపై లైంగిక దాడి చేసి కిరాత‌కంగా చంపేశాడు హాజీపూర్ కిల్ల‌ర్ శ్రీనివాస‌రెడ్డి..హాజీపూర్ వరుస హత్యాచారాల కేసుల్లో దోషిగా తేలిన శ్రీనివాస్ రెడ్డికి నల్గొండలోని ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది.

దీనిపై పోలీసులు అన్నీ బ‌ల‌మైన ఆధారాలు చూపించారు, అత‌నికి ఉరి త‌ప్ప‌కుండా వేయాలని వాధించారు, మూడు నెల‌లు దీనిపై విచార‌ణ చేశారు, ఈ కేసులో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కూ 101 మంది సాక్ష్యుల‌ని విచారించారు.

శ్రావణి, కల్పన కేసులో ఉరిశిక్ష విధించగా, మనీషా కేసులో జీవిత ఖైదును ఖరారు చేసింది కోర్టు. అన్నీ ఏక‌కాలంలో అమ‌లు చేయాలి అని తెలిపింది కోర్టు..బాలికల్లో ఇద్దరిది బొమ్మల రామారం మండలం హాజీపూర్ కాగా, మరొక బాలికది మైశిరెడ్డి పల్లి. ఈ ఘ‌ట‌న‌లు తెలంగాణ‌లో పెను చ‌ర్చ‌కు కార‌ణం అయ్యాయి.

2017లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని, 2019 ఫిబ్రవరిలో డిగ్రీ చదివే విద్యార్థినిని, అదే సంవత్సరం ఏప్రిల్ లో మరో పాఠశాల విద్యార్థినిని అత్యాచారం చేసి చంపేశాడని కోర్టు నిర్ధారించింది. కాని ఈ కేసులో తాను నేరాలు చేయ‌లేదు అని బుకాయించాడు.. కాని కోర్టుకు బ‌ల‌మైన ఆధారాలు అన్నీ పోలీసులు చూపించారు. ఇక శ్రీనివాస‌రెడ్డికి ఉరిశిక్ష విధించ‌డం పై బాలిక‌ల త‌ల్లిదండ్రులు సంతోషించారు. గ్రామ‌స్తులు ట‌పాకాయ‌లు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.