సినిమా నటులు లేదా సీరియల్ నటులు యాంకర్లకు అభిమానులు ఉంటారు అనేది తెలిసిందే ..ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారికి ఫేమ్ అలాగే ఉంటుంది, అయితే వారిని కలవాలి ఫోటోదిగాలి అని అభిమానించే వారు చాలా మంది ఉంటారు. తాజాగా ఇలా ఇంటికి వచ్చే అభిమానులతో యాంకర్ శ్రీముఖికి బాగా ఇబ్బంది కలుగుతోందట.
బిగ్ బాస్ మూడో సీజన్ లో రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. కాని ఇటీవల ఆమె ఫుల్ బిజీ అయ్యారు, సినిమాలకు కూడా ఆమె సైన్ చేస్తున్నారట.
కొందరు అభిమానులమంటూ నేరుగా ఇంటికి వచ్చి ఫొటోలు దిగుతామంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆమె సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో తెలియచేసింది.
తమకు తెలిసిన వాళ్ల ద్వారా నేను ఎక్కడ ఉంటున్నానో తెలుసుకుని అక్కడికి అభిమానులమంటూ వచ్చేస్తున్నారు. ఇంటి ముందు గంటలు గంటలు పడిగాపులు కాస్తున్నారు. దేనికైనా ఓ సమయం, సందర్భం ఉండాలి కదా మాకూ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి కదా అదంతా వదిలేసి కొందరు వ్యక్తులు, ఫలానా ఊరి నుంచి వచ్చాం మీతో ఫొటో దిగాలి అంటున్నారు.
వారిలో అబ్బాయిలు ఉంటున్నారు ఇలా అయితే ఎలా నా పీఏకి సమాచారం ఇస్తేనే దానికంటూ ఓ రోజు కేటాయిస్తా అని తెలిపింది శ్రీముఖి, నేను ఉదయం నుంచి రాత్రి వరకూ షూటింగ్ చేసి వస్తాను ఇలా ఉదయం లేచేసరికి అభిమానులు వస్తుంటే మమ్మల్ని అర్ధం చేసుకోవాలి కదా అని తెలిపింది.