ఈ మధ్య ఏ చిన్న కార్యక్రమం చేసినా రాజకీయాలకు సంబంధించి అప్ డేట్ అయినా, మొత్తం ఫేస్ బుక్ ద్వారానే తెలుసుకుంటున్నారు.. అందుకే సోషల్ మీడియాలో చాలా మంది యాక్టీవ్ గా ఉంటున్నారు, కొన్ని కొన్ని సార్లు పార్టీలకు ఈ ఫేస్ బుక్ లో అభిప్రాయాలు పోల్స్ పెట్టిన సమయంలో షాకింగ్ సమాధానాలు వస్తాయి, అలాగే షాకింగ్ రిజల్ట్ వస్తుంది. తాజాగా వైసీపీకి అదే పరిస్దితి వచ్చింది.
ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్.. దీనికి చాలా మంది మద్దతు ఉంది అని 13 జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు.. తాజాగా దీనిపై వైసీపీ ఫోరం ఫేస్బుక్ పేజ్లో ఓ పోల్ నిర్వహించింది..
అమరావతి రాజధానిగా ఏ నగరం ఉండాలని అందులో పోల్ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో అమరావతికి 77 శాతం మంది, విశాఖ పట్నానికి 23 శాతం మంది ఓట్లు వేశారు.
ఇది తెలుగుదేశం సోషల్ మీడియా సైన్యం ఇప్పటికే షేర్ చేస్తున్నారు, తాజాగా దీనిని స్క్రీన్ షాట్లు తీసి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి సటైర్లు వేశారు. చూశారా? ఏపీ రాజధాని అమరావతి అని చాలా మంది కోరుకుంటున్నారు, మన రాజధాని అమరావతి అని తెలిపారు ఆయన.. ఇది వైసీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.