ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన రాధా, కొద్ది రోజులు టీడీపీలో కూడా సైలెంట్ గా ఉన్నారు, తర్వాత మళ్లీ యాక్టీవ్ అయ్యారు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్నారు, వారికి మద్దతు ఇస్తున్నారు, రాజధానిగా అమరావతి కొనసాగాలి అని చెబుతున్నారు.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితార సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. రైతులకు తన మద్దతు తెలిపారు. రైతులు రోడ్లపైకి వచ్చి ఇలా దీక్షలు నిరసనలు చేస్తున్నా జగన్ సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు.
దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంటే ఏం చేస్తాం? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మూర్ఖత్వాన్ని పక్కనబెట్టి, ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు. కోర్టు ఇచ్చిన తీర్పుని ఉత్తర్వులని కూడా పక్కన పెట్టారు అని విమర్శించారు, దీని కోసం అన్నీ పార్టీలు కలిసి పని చేయాలని జేఏసీతో కలిసి నడవాలి అని కోరారు.