అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు… ఎన్నికలకు ఆరు మాసాల ముందు కృష్ణా జిల్లాకు చెందిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే… ఆయనకు బలమైన కమ్మ సమాజికవర్గం సపోర్ట్ గా నిలవడంతో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు….
మంత్రిపదవి దక్కుతుందని అందరు భావించారు… కానీ ఆదే సామాజిక వర్గానికి చెందిన కొడాలి నానికి జగన్ తన కేబినెట్ లోకి తీసుకోవడంతో వసంతకు బ్రేక్ పడింది… దీంతో ఆయన నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి పెట్టారు… ఇప్పుడు రాజధాని రగడ విషయంలో వసంతపై ఒత్తిడి పెరిగిందట…. ఆయన గెలుపుకు సపోర్ట్ చేసిన కమ్మ సామాజిక వర్గం రాజధానిని అమరావతిలోనే ఉంచాలని కోరుకుంటోంది…
జగన్ ను ఎలాగైనా ఒప్పించి రాజధాని ఇక్కడే ఉంచేలాచేయాలని వారు కోరుతున్నారట వసంతను… ఒక పక్క తనను గెలిపించిన సామాజివర్గం మరోవైపు జగన్ దూకుడులమధ్య వసంత సతమతమవుతున్నారట…ఈ క్రమంలో అమరావతి ఎక్కడకు తరలిపోదని ఇక్కడే ఉంటుదని లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉంటుందని చెప్పారట వసంత… అప్పుడు సానుకూలంగా వ్యక్తం చేసిన కమ్మ సామాజికవర్గ ప్రజలు తర్వాత గుస్సాయిస్తున్నారట…