పవన్ కు నో చెప్పిన బ్యూటీ

పవన్ కు నో చెప్పిన బ్యూటీ

0
94

పవన్ కల్యాణ్ తాజాగా వరుసగా సినిమాలు అంగీకరించారు.. ప్రస్తుతం పింక్ సినిమా అలాగే క్రిష్ తో ఓ సినిమా చేస్తున్నారు.. తర్వాత హరీష్ శంకర్ చిత్రం పట్టాలెక్కనుంది.. ఇక మరిన్ని కథలు కూడా ఆయన వింటున్నారు.. అయితే ఆయన వరుస సినిమాల ప్రకటనలతో చాలా ఆనందంలో ఉన్నారు అభిమానులు.

ఇక మరీ ముఖ్యంగా క్రిష్ తో చేయనున్న భారీ చారిత్రక చిత్రంపై వచ్చిన అప్ డేట్ తో చాలా ఆనందంగా ఉన్నారు పవన్ ఫ్యాన్స్.. ఇందులో బందిపోటుగా పవన్ కనిపించనున్నాడు. అయితే ఆయన పక్కన నటిగా కైరా అద్వానిని తీసుకుంటారు అని వార్తలు వినిపించాయి, దాదాపు రెండు రోజులుగా ఇదే ప్రచారం జరిగింది, క్రిష్ సంప్రదింపులు జరుపుతున్నారు అని టాలీవుడ్ టాక్ నడిచింది.

అయితే ఈ సినిమాలో నటించేందుకు ఆమె నో చెప్పేసింది. బాలీవుడ్లో భారీ సినిమాలతో బిజీగా వున్న కైరా, ప్రస్తుతం డేట్లు ఖాళీ లేవని చెప్పిందట. దాంతో వాణీ కపూర్ ను ఎంపిక చేసే ఆలోచనలో క్రిష్ వున్నాడని అంటున్నారు. మొత్తానికి ఈ జోడి లేనట్టే అని తెలుస్తోంది.