విశాఖ రాజధానిగా అవుతోంది… ఇక అక్కడ నేతలతో పాటు ప్రజలు కూడా చాలా ఆనందంలో ఉన్నారు.. మన సిటీకి మరింత కొత్త శోభ వస్తుంది అని విశాఖ నగర ప్రజలు భావిస్తున్నారు..సినీనటుడు, వైసీపీ నాయకుడు అలీ విశాఖలో ఓ కార్యక్రమానికి వచ్చారు.. ఈ సమయంలో ఆయన కొన్ని కామెంట్లు చేశారు.
విశాఖ ప్రజలు చాలా తెలివైన వారే కాకుండా, చాలా మంచోళ్లని, ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి బాగా తెలుసని సినీనటుడు, వైసీపీ నాయకుడు అలీ అన్నారు… చోడవరంలో నిన్న సాయంత్రం జరిగిన ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు..వైసీపీ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తోందని, వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.
వైసీపీ ప్రభుత్వం ముస్లింల మక్కా సందర్శన కోసం అందిస్తున్న ప్రయోజనాన్ని అర్హులంతా వినియోగించుకోవాలని అలీ ముస్లిం సోదరులకి తెలియచేశారు..ఇక విశాఖ నగరం అంటే తనకు చాలా ఇష్టం, అలాగే ప్రత్యేకంగా అభిమానించే సిటీ అని తెలిపారు,అలీని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఘనంగా సత్కరించారు. సరదా డైలాగులతో అందరిని అలరించారు అలీ.