జగన్ మరో కీలక ప్రకటన…

జగన్ మరో కీలక ప్రకటన...

0
85

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు… ఈ నెల చివరిలోగా 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు… తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు జగన్…

ఆ తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మహిళలకు రక్షణ కరువైందని అన్నారు… అందుకే మార్పు కోసం దిశ యాక్ట్ తీసుకు వచ్చామని తెలిపారు.. 13 జిల్లాల్లో దిశ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు…

నేరం చేస్తే చట్టం ప్రకారం ఎంతటివారినైనా 21 రోజులో శిక్షపడాలన్న ఉద్దేశంతో ఈ యాక్ట్ ను తీసుకు వచ్చామని తెలిపారు… అలాగే విశాఖ తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం 31 కోట్లు విడుదల చేశామని తెలిపారు జగన్..