మోసపోయిన యాకంర్ రవి… చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు…

మోసపోయిన యాకంర్ రవి... చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు...

0
102

బుల్లితెర స్టార్ యాంకర్ రవి తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు తన దగ్గర 45 లక్షల మేరా డబ్బులు తీసుకుని మోసం చేసిని ఓ వ్యక్తిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో రవి క్రిమినల్ కేసుపెట్టాడు… డిస్టిబ్యూటర్ సందీప్ అనే వ్యక్తి తన దగ్గర నుంచి సుమారు 45 లక్షల రూపాయలు తీసుకుని తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించాడు రవి…

సందీప్ ఓ సినిమా డిస్టిబ్యూషన్ విషయంలో తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు యాంకర్ రవి.. అంతేకాదు తాను ఎక్కడికి వెళ్లినా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను పంపి బెదిరిస్తున్నాడని చెప్పాడు..

తన దగ్గర డబ్బులు తీసుకున్న విధంగానే సందీప్ చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారని రవి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఇక ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు విచారణ చేస్తామని చెప్పారు…