భారత క్రికెటర్ల గురించి సినిమాలు తీయాలి అని చాలా మందికి కోరిక ఉంటుంది… అలాగే పలువురు టాప్ ప్లేయర్స్ సినిమాలు వవ్చాయి… దోనిపై కూడా అలాగే చిత్రం వచ్చింది… అయితే క్రికెటర్ సినిమాల్లో నటించడం అంటే ఎక్కడో కొందరు మాత్రమే ఉంటారు.. కాని తాజాగా ఓ క్రికెటర్ సినిమాల్లోకి వస్తున్నాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సరికొత్త అవతారం ఎత్తుతున్నాడు. ఆఫ్ స్పిన్నర్ గా బంతిని సుడులు తిప్పుతూ ప్రత్యర్థులను హడలెత్తించిన ఈ పంజాబ్ యోధుడు ఇప్పుడు మేకప్ వేసుకోబోతున్నాడు, అందరూ క్రికెట్లో ముద్దుగా భజ్జీ అని పిలుచుకుంటారు.. మరి ఇప్పుడు అలాగే చిత్రాల్లో చేయాలి అని చూస్తున్నారు.
తమిళంలో ఫ్రెండ్షిప్ అనే చిత్రం తెరకెక్కుతోంది.ఇందులో హర్భజన్ నటిస్తున్నాడు, శ్రీలంకకు చెందిన లోస్లియా మరియనేసన్ ఈ చిత్రంలో హీరోయిన్. జేపీఆర్, స్టాలిన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య ద్వయం దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాని తెలుగు హిందీ కన్నడలో తమిళ్ లో విడుదల చేయనున్నారు … మరి ఈ స్పిన్నర్ సినిమాలలో ఎలా నటిస్తాడో చూడాలి… ఆయన అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు.