కొందరు భర్తలు సైకోల కంటే దారుణంగా ప్రవర్తిస్తారు…భార్య చిన్న తప్పు చేసినా దానిని అసలు జీర్ణించుకోలేరు.. దానిని క్షమించరాని నేరంగా పరిగణిస్తారు, తాజాగా అలాంటి ఓ ఘటనే జరిగింది. పని తొందరలో అనుకోకుండా అన్నంలో ఉప్పుకు బదులు చక్కెర వేసింది భార్య, వెంటనే భర్తకి కోపం వచ్చింది.. ఆమె చేసిన తప్పుని తట్టుకోలేకపోయాడు… ఆహారంలో విషం పెట్టి నన్ను చంపేయాలని చూస్తావా? అంటూ భార్య రెండు కళ్లను కారంతో నింపేశాడు ఆ శాడిస్ట్ భర్త.
ఈ దారుణమైన ఘటనతో బాధితురాలికి ఒక కంటిచూపు పోయింది. దీనిపై కుటుంబం కోర్టులో కేసు వేసింది.. కోర్టులోవిచారణకు వచ్చింది ఈ కేసు…విచారణలో తమ వివాహమై 12 ఏళ్లు అయిందని.. అప్పటి నుంచి ప్రతిరోజు తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని బాధితురాలు జడ్జికి చెప్పింది. ఏ చిన్న తప్పు చేసినా కొడతాడు అని చెప్పింది. రోజూ ఆరు గంటలు పచ్చి బూతులు తిడతాడట, రాత్రి 4 గంటల వరకూ టార్చర్ పెట్టి పడుకుంటాడట.
దీనిపై అతను వాదించుకోలేదు… తాను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు.. అయితే ఇంకా వాయిదాలలో ఈ కేసు ఉంది.. దాదాపు అతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అంటున్నారు లాయర్లు.