టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే బస్సుల సీజ్ అలాగే వ్యాపారాల మూత లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడం గునుల లీజ్ తీసేయడం తో ఇప్పటికే జేసీ ఫ్యామిలీ చాలా చిక్కుల్లో ఉంది, అయితే ఆ వ్యాపారాలు అన్నీ సక్రమం అయితే ఎందుకు ప్రభుత్వం ఇలా చేస్తుంది అని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీనేతలు.
తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి పూర్తిగా భద్రతను తొలగించింది ఏపీ సర్కార్ . గతంలో దివాకర్ రెడ్డికి 2 ప్లస్ 2 భద్రత ఉండేది. దీన్ని 1 ప్లస్ 1కు తగ్గించిన వైసీపీ ప్రభుత్వం తాజాగా భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది. అయితే ఇటీవల ఏపీలో చాలా మంది తెలుగుదేశం నేతలకు భద్రత తగ్గిస్తున్నారు.
ఇటీవల నారాలోకేష్ కు కూడా భద్రత తగ్గించారు ఇలా కొందరు మాజీ మంత్రులకి భద్రత ఎందుకు అని అంటున్నారు, అధికారంలో ఉంటే అవసరం అవుతుంది పదవి లేకుండా ఇలా సెక్యూరిటీ అవసరం లేదు అంటున్నారు, ఇలా ప్రజాధనం వృదా చేయడం ఏమిటి అని కొందరు విమర్శిస్తున్నారు, అయితే వైసీపీ ప్రభుత్వం సెక్యూరిటీ తొలగించడం పై సాధారణ వ్యక్తులు కూడా అదే చెబుతున్నారు.