ఎయిర్ టెల్ కి షాకిచ్చిన పూజా హెగ్డే

ఎయిర్ టెల్ కి షాకిచ్చిన పూజా హెగ్డే

0
113

సామాన్యులు మొబైల్ నెట్ వర్క్ పనిచేయడం లేదని కంప్లైంట్ ఇస్తే వారు సరిగ్గా పట్టించుకోరు.. ఇక సెలబ్రెటీల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అని అనుకుంటాం …ఎందుకు అంటే ఇది పెద్ద వార్త అవుతుంది కాబట్టి.. కాని టెలికం కంపెనీలు వారి సర్వీసులకి కూడా ఒక్కోసారి విఘాతం కల్పిస్తున్నారట.

తాజాగా హీరోయిన్ పూజా హెగ్దే ఇలాంటి సర్వీస్ పై సోషల్ మీడియాలో పోస్టు చేసింది…ఎయిర్ టెల్ వాడకండి.. మరో నెట్వర్క్కు మారండి’ అంటూ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఆ కంపెనీపై ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారుల సేవల విషయంలో ఆ సంస్థ సరిగ్గా స్పందించడం లేదని, పదే పదే సమస్య వస్తోందని తెలిపింది.

ఎయిర్టెల్ నుంచి ఇతర టెలీకాం సంస్థకు చెందిన సిమ్ వాడి సమయాన్ని సేవ్ చేసుకోవాలని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పింది. ఇక వెంటనే ఎయిర్ టెల్ కంపెనీ టీమ్ ఆమెకి కాల్ చేశారు.. తమ సర్వీసు నుంచి మీకు త్వరలో సమస్య పరిష్కారం అవుతుంది అని తెలిపారు.

హాయ్ పూజా.. మీకు కలిగిన సేవల అంతరాయం పట్ల క్షమాపణలు చెబుతున్నాం. మీకు ఎదురవుతున్న సమస్య ఇప్పుడు పరిష్కారం అయిందని భావిస్తున్నాం’ అని ఎయిర్టెల్ ఇండియా తెలిపింది. దీంతో పూజా హెగ్డే కూల్ అయింది. అయితే అప్పటికే చాలా మంది అభిమానులకి ఇది చేరింది.. సో సెలబ్రెటీలు ప్రైవేట్ నెంబర్లు వాడతారు.. వారికి కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే ఇక ఎలా అని సాధారణ యూజర్లు కూడా చర్చించుకుంటున్నారు.