రాజమండ్రికి చిరంజీవి ఎందుకంటే

రాజమండ్రికి చిరంజీవి ఎందుకంటే

0
93

చిరంజీవి రాజకీయాలు పక్కన పెట్టేసి పూర్తిగా సినిమాలకే తన సమయం కేటాయించారు… ఇది అభిమానులకి కూడా చాలా ఆనందం కలిగించింది, ఇక తాజాగా సైరా సినిమా తర్వాత ఆయన కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది ..అతి పెద్ద సెట్స్ వేసి దాదాపు 10 రోజుల పాటు హైదరాబాద్ లో 1 షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు.

ఇక తదుపరి షెడ్యూల్ గోదావరి జిల్లా ప్రాంతం రాజమండ్రిలో జరుగనుందట. చిరంజీవి పలువురు సీనియర్ నటులకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రాజమండ్రిలో చిత్రీకరించనున్నారు.ఇక చిరుతో ఈ షెడ్యూల్ లో త్రిష కూడా షూటింగ్ లో పాల్గొంటారట.

ఈ సినిమాకి నిర్మాతలుగా రామ్ చరణ్ – నిరంజన్ రెడ్డి ఉన్నారు, ఇక టైటిల్ విషయంలో అనేక వార్తలు వినిపించాయి.. కాని తాజాగా ఆచార్య అనే టైటిల్ ఫైనల్ చేశారు అని తెలుస్తోంది.ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇక ఇందులో చరణ్ కూడా నటిస్తున్నారు, ఇక దేవాలయాలకు సంబంధించి ఎండోమెంట్ ఆఫీసర్ గా చిరు ఇందులో కనిపిస్తారట.