దేశరాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నేడు వచ్చాయి, ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ ..ఆయనకు బంపర్ మెజార్టీ వచ్చింది, సుమారు 60 సీట్లు గెలుచుకునే దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ఆనందంలో వారి కుటుంబంలో మరో రెండు విషయాలు ఇంకా ఆనందంలో నింపాయి.
అవును ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత పుట్టిన రోజు.. అదే రోజు ఫలితాలు రావడంతో ఆ కుటుంబం చాలా సంతోషంలో ఉంది, అంతేకాదు ఆమెకి నెటిజన్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ కంగ్రాట్స్ కేజ్రీవాల్ ఫ్యామిలీ అంటున్నారు.
ఆమె మీ వెనుక ఉన్న శక్తి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఆమె పుట్టినరోజు నాడే కేజ్రీ మళ్లీ విజయం సాధిస్తున్నారంటూ, ఆయనకు సునీతే అదృష్టదేవత అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎలక్షన్లలోనే కేజ్రీ కుమారుడు తొలిసారి ఓటేశాడు. దీంతో భార్య పుట్టిన రోజున ఫలితాలు రావడం, తన కుమారుడు ఓటు వేసిన ఏడాది ఫలితం కూడా తన కు పాజిటీవ్ గా రావడంతో కేజ్రీవాల్ చాలా సంతోషంగా ఉన్నారు.