మొత్తానికి పవన్ కల్యాణ్ అభిమానులకి మాత్రం ఈ ఏడాది గుడ్ న్యూస్ వినిపించారు పవన్ కల్యాణ్… పింక్ సినిమా రీమేక్ తో ఆయన సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు, ఇక తర్వాత క్రిష్ తో కూడా సినిమా ఒకే చేశారు.. అది కూడా వర్క్ మొదలు అయింది, తర్వాత హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నారు, తర్వాత అన్నీ సెట్ అయితే త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది.. ఆ తర్వాత కొరటాలకు కూడా ఛాన్స్ ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.. దీంతో పవన్ మరో మూడు సంవత్సరాల వరకూ సినిమాలతో బిజీగా ఉంటారు అని తెలుస్తోంది.
అయితే తాజాగా క్రిష్ సినిమా ఎలా తీస్తారు? కథాంశం ఏం తీసుకుంటారు అనే చర్చ జరుగుతోంది.. ఇక పవన్ తో పిరియాడిక్ చిత్రం చేస్తున్నారు ఆయన .. ఇక గత పవన్ సినిమాలను పరిశీలించినా పవన్ కళ్యాణ్ నటించబోయే తొలి పీరియాడికల్ మూవీ ఇదే కాబోతుంది… తెలంగాణ రాబిన్ హుడ్గా పిలవబడే పండుగ సాయన్న జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు వీర అని తెలుస్తోంది, అందుకే ఈ చిత్రానికి పేరు విరూపాక్షి పెడదాం అని ఆలోచిస్తున్నారట.. ఇందులో హీరోయిన్లుగా కియారా అద్వానీ, వాణీ కపూర్ పేర్లు తెరపైకి వచ్చాయి.. మరి ఇంకా ఎవరిని ఫైనల్ చేశారు అనేది తెలియాలి.. పాన్ ఇండియాగా ఈ చిత్రం రాబోతోంది, ఇందులో నటీనటుల గురించి త్వరలో ప్రకటన చేయనున్నారట.